CARE Hospitals Logo
×

Healthy Cooking Oils

Updated on 19 April 2021

ఆరోగ్యం కోసం..

ఆరోగ్యాన్ని పాడుచేసే పదార్థాలను తీసేస్తారని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది (80-85 శాతం) రిఫైన్ ఆయిల్సేవాడతారనే విషయాన్ని గుర్తు చేస్తారు. అయితే రిఫైన్డ్ ఆయిల్ తయారీలో ఫిజికల్ తో పాటు కెమికల్ ప్రాసెసింగ్లు తప్పనిసరి.

  • రిఫైన్ ఆయిల్ తయారీలో నాలుగు ప్రధానమైన స్టేట్లు ఉంటాయి.
  • అవి దిగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, డియోడరైజింగ్. ఈ దశల్లో నూనెలు రకరకాల కెమికల్ ట్రీట్మెంట్ కు గురవుతాయి.
  • హైటెంపరేచర్ (200 నుంచి 400 డిగ్రీల సెల్సియస్) వద్ద వేడి చేస్తారు
  • డీగమ్మింగ్ లో ముడి చమురుల్లో ఉండే బంకలాంటి (ఫ్రాస్పటైడ్స్) పదార్థాన్ని వేరు ఈ ప్రాసెస్లో హెక్సేన్ అనే కెమికల్ ఉపయోగిస్తారు. దీన్ని తర్వాతి స్టేజ్ లో తీసేసే ప్రయత్నం చేసినా కానీ ట్రేసెస్ మిగిలిపోతాయి. రెండో దశ న్యూట్రలైజేషన్ ప్రక్రియ
  • ఇందులో ఫ్యాటీ యాసిడ్లను తొలగిస్తారు. దీన్ని కెమికల్ రిఫైనింగ్' అని కూడా అంటారు.
  • ఈ మెథరిని ఎక్కువగా వెజిటబుల్ ఆయిల్ రిఫైనింగ్ కోసం వాడతారు.
  • ఫాస్పరిక్ యాసిడ్ తో క్రూడాయిల్ ని ట్రీట్ చేశాక కాస్టిక్ సోడియం హైడ్రాక్సైడ్) సొల్యూషన్స్ సూట్రలైజ్ చేస్తారు.
  • అప్పుడు నూనెపై నురగలాంటి పదార్థం తేలుతుంది.
  • సెంట్రిఫ్యూజ్ విధానం ద్వారా కొన్ని మలినాలను తొలగిస్తారు. ఆ తర్వాత ఆయిల్ని డియోడరైజేషన్ చేస్తారు. ఇక్కడ 240 నుంచి 260 డిగ్రీల సెల్సియెస్ టెంపరేచర్ లో ఆయిల్ ని వేడి చేసి అందులోని ఆదర్ వ్రాసన)ని తొలగిస్తారు. అలా ఈ నాలుగు స్టేజ్ ల్లో మరికొన్ని ట్రీట్మెంట్లు చేస్తారు. ఆరేడు రకాల కెమికల్స్ ని ఉపయోగిస్తారు. మొత్తం మీద ఈ ప్రాసెస్ల ద్వారా తయారైన రిఫైన్డ్ ఆయిల్ బయటకు వచ్చాక దాన్ని ప్లాస్టిక్ కవర్స్, బాటిళ్లలో ప్యాక్ చేస్తారు.

ఇలా తయారైన రిఫైన్డ్ ఆయిల్ కు నూనెకు రంగు, రుచి, వాసన వుండవు. అన్ని నూనెలు ఒకే రకంగా ఉంటాయి. గడ్డ కట్టవు. ఏళ్ల తరబడి పాడు కావు. కొన్ని కంపెనీలు వాసన కోసం ఎసెన్స్ కలుపుతాయి. ముడి నూనెల నుంచి ఫ్రీఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, ఆక్సిడైజ్ ప్రొడక్టులు, మెటల్ అయాన్స్, కలర్ పిగ్మెంట్స్, ఇతర ఇంప్యూరిటీలను తొలగించేందుకు రిఫైనింగ్ పద్ధతి వాడుతున్నామని ఆయిల్ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. రిఫైనింగ్ వల్ల విటమిన్-ఇ పోకుండా ఉంటుందని, గింజ నుంచి పూర్తిస్థాయిలో నూనెను పిండొచ్చని అంటాయి. రిఫైనింగ్ ప్రాసెస్ అంతా ఎస్ఎస్ఎస్ఎ ప్రుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రమాణాల ప్రకారమే జరుగుతుందని ప్రచారం చేసుకుంటాయి. ట్రెడిషనల్ గానుగ నూనెలు గానుగ నూనెలు.. తరతరాలుగా వస్తున్న నూనెలు. వీటిని సహజంగా తయారు చేస్తారు. గానుగ నూనెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ -ఇ, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు, బయోప్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇప్పుడు గానుగ నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే గానుగ నూనెల తయారీ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఆన్లైన్లో మిషన్లు తెప్పించుకుని.. ఇళ్లలోనే నూనె తయారుచేసుకుంటున్నారు కొందరు.. సంప్రదాయ పద్ధతుల్లో గానుగ నూనెలు తీసే పద్ధతులు ఉన్నాయి. దున్నపోతులు, ఎడ్లు, లేగదూడలు, గాడిదలను కాడికి కట్టి గానుగలో గింజలు వేసి గుండ్రంగా తిప్పుతారు. అప్పుడు గింజలు విప్పి పిప్పి అయ్యి.. ఆ గానుగలో నుంచి నూనె బయటకు వస్తుంది. గానుగ ఆడింటచేప్పుడు ఆర్బీఎం (ిటేషన్ పర్ మినిట్) తక్కువగా ఉంటుంది. నిముషానికి రెండు, మూడు చుట్టు తిరిగినప్పుడు.. టెంపరేచర్ ఎక్కువగా రిలీజ్ కాదు. ఫలితంగా నూనెలో పోషకాలు పోవు. అయితే ఇప్పుడు కరెంట్ నడిచే గానుగమిషిన్లు వచ్చాయి. దీని అర్పీఎం కొంచెం ఎక్కువగా ఉంటోంది. గానుగ నూనెలోని దాదాపు అన్ని పోషక విలువలు ఉంటాయి. మిషన్ గానుగల్లో ఇప్పుడు పల్లీ, నువ్వులు, నల్ల నువ్వులు, కుసుమ, ఆవాలు, అవిసె, బాదం, కొబ్బరి, ఆముదం గింజుల నుంచి రకరకాల నూనెలు తీస్తున్నారు. గింజలు తీసుకుపోతే నూనె పట్టించే సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మే సెంటర్లలో ఆర్గానిక్ గింజలతో కళ్ల ముందే నూనె తీసి ఇస్తున్నారు. ఒకే రకం ఆయిల్ వాడొద్దు పంజాబ్, హర్యానాల్లో ఆవ గింజల నూనె, గుజరాత్ లో పత్తి గింజల నూనె, దక్షిణాది రాష్ట్రాల్లోపల్లి, నువ్వుల నూనెల్ని కేరళలో కొబ్బరి నూనెను ఎక్కువ వాడతారు. ఒకప్పుడు ఒకేరకమైన నూనెల్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. గ్లోబలైజేషన్, ట్రాన్స్పరేషన్, జనాల్లో హెల్త్ కాన్షియస్ పెరగడంతో.. జనాలు రకరకాల ఆయిల్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా పల్లీ, నువ్వుల నూనెల్ని ఎక్కువగా వాడే మన ప్రాంతాల్లో కొబ్బరి నూనె వాడకం కూడా పెరిగింది. అలాగే ఆరోగ్యానికి మంచిదని కొందరు కుసుమ. ఆవ. పొద్దుతిరుగుడు (సప్లవర్), రైస్ బ్రాన్.. అంటూ రకరకాల నూనెలు వాడుతున్నారు. మార్కెట్లో ఇప్పుడు అన్నిరకాల నూనెలు దొరుకుతున్నాయి. వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు యానిమల్ ఫ్యాట్ నికూడా కొందరు వంటలకు ఉపయోగిస్తున్నారు. వెజిటబుల్ ఆయిల్స్ లేని రోజుల్లో, యానిమల్ ఫ్యాట్ ను వాడేవాళ్లు. ఆరోగ్యంగా ఉండేవాళ్లు. అందుకే నెయ్యిని కూడా వంటల్లో వినియోగించమని చెప్పన్నారు. ముఖ్యంగా ఆవు నెయ్యి ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. అయితే గానుగ నూనె అయినా, రిఫైన్ ఆయిల్ ఆయినా ఎప్పుడూ ఒక్కటే వాడకుండా మారుస్తూ ఉండడం మంచిదని హెల్త్ ఎక్స్ప చెబుతున్నారు. కోల్డ్ ప్రెస్ట్ (గానుగ) నూనెలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ నూనెల తయారీ ఎంతో శ్రమతో కూడుకొని ఉంటుంది. అందుకే రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ నూనెలని యూజ్ చేయడం వల్ల హెల్దీగా | ఉండొచ్చు, ఆరోగ్య సమస్యల్ని బట్టి ఆయిల్స్ వాడడం ఈ రోజుల్లో అన్ని రకాలుగా మంచిది. అయితే గానుగ పట్టిన నూనెలే గుండెకి మంచిది. జనాలు తక్కువ రేటుకు , వస్తుంది కదా అని రిఫైన్డ్ ఆయిల్స్ కొంటున్నారు. అలాగే నూనెలను అప్పుడప్పుడు , మారుస్తూ ఉండడం మంచిది. కొన్ని రోజులు ఒక నూనె, ఇంకొన్ని రోజులు ఇంకో , రకమైన నూనె యూజ్ చేయాలి. - డా. ప్రణీత్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్

ENQUIRY FORM

STAY CONNECTED
PREVIOUS POST
NEXT POST

YOU MAY ALSO LIKE

RECENT BLOGS

TOUCHING LIVES AND MAKING A DIFFERENCE

Have a Question?

If you cannot find answers to your queries, please fill out the enquiry form or call the number below. We will contact you shortly.

+91-40-6810 6589

Follow Us On