19 Januar 2023
అల్సర్ డయాబెటిస్ మెల్లిటస్, డయాబెటిక్ ఫుట్ అనేదిఈ మధ్యకాలంలో ఎక్కువైంది. సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల అధిక బరువు పెరుగుతోంది. దీని వల్లే ఇతర సమస్యలు కూడా వస్తాయి. అయితే, షుగర్ పేషెంట్స్కి సాధారణంగా వచ్చే సమస్యల్లో డయాబెటిక్ ఫుట్ కూడా ఒకటి. ఇది షుగర్ ఉన్నవారికి పాదాలపై పుండ్లని, గాయాలని చేస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
కొన్ని సార్లు న్యూరోపతి కారణంగా ఈ సమస్య వస్తుంది. దీంతో పాటు, గాజు ముక్కల మీద అడుగు పెట్టడం, గాయాలవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే, గాయలైనప్పుడు నొప్పి లేకపోతే, స్పర్శ లేకపోతే గమనించండి. ఇలాంటివి ఆలస్యంగా గమనిస్తే అది ప్రమాదంగా మారొచ్చు. నరాల వ్యాధి కూడా పాదం అంతర్గత కండరాల పనితీరు కోల్పోయేలా చేస్తుంది.
ఇక ఇమ్యూనిటీ తగ్గడం వల్ల డయాబెటిక్ మెల్లిటస్ ఎక్కువ అవుతుంది. దీంతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. రక్త సరఫరా తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా త్వరగా ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే ప్రమాదంగా మారొచ్చు.
వృద్దాప్యం కారణంగా ధమనులు గట్టి పడతాయి. దీనిని ఆర్టెరియోస్క్లెరోసిస్ అంటారు. ధమనులు తక్కువగా పనిచేయడం, పూర్తగా మూసుకుపోవడం వల్ల నడకలో, కండరాల తిమ్మిరిలో నొప్పి వస్తుంది. తీవ్రమైన వ్యాధి పుండు, గ్యాంగ్రేన్కి కారణమవుతుంది.
పాదాల సమస్యలు వస్తే ముందుగా రక్తంలో చక్కెరను నియంత్రించాల్సి ఉంటుంది. పొగాకు, పొగ తాగే అలవాటు ఉంటే తగ్గించాలి. దీని వల్ల రక్తపోటు ఇతర సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వీలైనంతగా శారీరక శ్రమ అవసరం. దీనికోసం నడుస్తుండాలి. నడవడం వల్ల గుండెకి కూడా మంచిదని గుర్తుపెట్టుకోవాలి.
డయాబెటిక్ ఫుట్ ఉంటే మొదట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. చనిపోయిన కణజాలం ఎక్సిషన్, చీము పారడం వంటి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. అవసరమైత డ్రెస్సింగ్ చేస్తారు. రక్త సరఫరా తగ్గిన రోగులకు యాంజియోప్లాస్టీ, బైపాస్ టు లెగ్, పాద ధమనుల ద్వారా కాలు, పాదాలకు రక్త సరఫరా అయ్యేలా చూస్తారు. డయాబెటిక్ ఫుట్ని మంచి ట్రీట్మెంట్తో సాల్వ్ చేయొచ్చు. లేటెస్ట్ వాస్కులర్ సర్జికల్ టెక్నిక్స్ అవవసరం ఉంటుంది.
Dr. PC Gupta, Abteilung für Gefäß- und endovaskuläre Chirurgie sowie interventionelle Gefäßradiologie, CARE Hospitals, Banjara Hills, Tel.: 96660 88000 / E-Mail: vasculartherapy@gmail.com
Hinweis: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. Das ist nicht alles. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.