ícono
×

Medios Digitales

24 de enero de 2023

Síntomas de tuberculosis: వీరికే ఎక్కువగా టీబి వస్తుందట..

Síntomas de tuberculosis: క్షయ వ్యాధి (టిబి).. ఈ తీవ్రమైన సమస్య ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. క్షయ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా, దగ్గు, తుమ్ముల ద్వారా గాలిలోకి విడుదలయ్యే బిందువుల నుండి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.

ఊపిరితిత్తులకి వచ్చే టీబి శరీరంలోని ఇతర భాగాలైన బ్రెయిన్, వెన్నుపూస, కిడ్నీ, ఎముకలకి కూడా వ్యాపించే అవకాశం. ఈ సమస్య వచ్చినప్పుడు సాధారణంగా విపరీతమైన దగ్గు వస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో వచ్చినప్పుడు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు వచ్చినప్పుడు దగ్గు అంతగా ఇబ్బంది పెట్టదు. కానీ, ఆ భాగాలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఎవరికి వస్తుంది..

మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చే టీబి గాలి ద్వారా ఓ వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ సమస్య ఎవరికైనా వస్తుంది. కొన్ని కారణాల వల్ల వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు అంటే హెచ్ఐవీ, షుగర్ వ్యాధి కంట్రోల్ లేని వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకి బానిసైన వారికి, కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకి, స్టెరాయిడ్స్ వాడేవారికి, సరైన పోషకాహారం తీసుకోని వారికి, ఛాతికి సంబంధించిన సమస్యలు ఉన్నవారికి త్వరగా ఈ సమస్య వస్తుంది.

లక్షణాలు..

టీబి వ్యాధి నాడీ వ్యవస్థను చాలా విధాలుగా దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఎలాంటి లక్షణాలు చూపించదు. కొన్ని కేసుల్లో మాత్రం..

తలనొప్పి
వాంతులు
చూపు మందగించడం
పక్షవాతం
తరచుగా జ్వరం
త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు
చలి
ఆకలి లేకపోవడం
కఫంతో కూడిన దగ్గు మూడు, అంతకంటే ఎక్కువ వారాలు ఉండడం
బరువు తగ్గడం

క్షయ వ్యాధి మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు సహా మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయొచ్చు.

స్పైనల్ ట్యూబర్‌కూలోసిస్ (enfermedad de Pott).

ఇది వెన్నెముకకి వచ్చే సమస్య. ఇది వస్తే వెన్నెముక ఎముకల చుట్టూ ఉన్న టిష్యూలు దెబ్బతింటాయి. దీంతో వెన్నునొప్పి, వెన్నుపూస వంకర తిరగడం, తిమ్మిర్లు రావడం, కాళ్ళు చేతులు బలహీనమవుతాయి.

టెస్ట్..

సాధారణంగా క్షయ వ్యాధిని కఫం టెస్ట్తో నిర్ధారిస్తారు. అయితే, ఇది ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్న క్షయవారికే సాధ్య మవుతుంది. Más información పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారు.
 

ట్రీట్‌మెంట్..

టిబికి ట్రీట్మెంట్ శరీరంలో ఎక్కడ సమస్య ఉంది, ఎంత తీవ్రత ఉంది, వ్యాధి సోకిన వారు ముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఇమ్యూనిటీ ఎలా ఉంది.. ఇలాంటి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని చేస్తారు. అయితే, RNTCP (Programa nacional revisado de control de la tuberculosis) ద్వారా ఉచితంగా మందులు పొందొచ్చు.

రెండు రకాలుగా..

టీబికి ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ఇంటెన్స్ ఫేస్. ఇందులో నాలుగా రకాల టీబి మందులు రెండు నెలల పాటు ఇస్తారు. మెయింటనెన్స్ ఫేస్. దీనిలో రెండు రకాల టీబి మెడిసిన్ నాలుగు నెలల పాటు ఇస్తారు. వ్యక్తికి ఏ భాగంలో టిబి ఉంది. ఎంత తీవ్రంగా ఉంది అనే విషయాలను బట్టి ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇందులో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. Más información మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంది మందిలో టిబి ట్రీట్మెంట్తో పాటు స్టెరాయిడ్స్, ఫిట్స్కి సంబంధించిన మందులు కొంత కాలం వాడాలి. కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం అవ్వొచ్చు.
 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

టీబికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారు ఏ పరిస్థితిలోనైనా డాక్టర్ సలహా లేకుండా మెడిసిన్ ఆపొద్దు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చి MDTRB (Tuberculosis resistente a múltiples fármacos)కి దారి తీయొచ్చు. మందులతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం, వర్కౌట్, చెడు అలవాట్లకి దూరంగా ఉంటూ ఇమ్యూనిటీ పెంచుకోవడం, డాక్టర్ సలహాతో సరైన లైఫ్స్టైల్ని పాటించడం చాలా ముఖ్యం.

-Dr. Sudheer Nadimpalli, neumólogo consultor, CARE Hospital Hitech City
Significado: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. 

Enlace de referencia: https://telugu.samayam.com/lifestyle/health/what-are-the-symptoms-of-tuberculosis-how-does-affect-the-body/articleshow/97269584.cms?story=6