ícono
×

Medios Digitales

Dolor articular: 10 reemplazos robóticos de rodilla en 12 horas en los hospitales CARE de Visakhapatnam

6 de septiembre de 2025

Dolor articular: 10 reemplazos robóticos de rodilla en 12 horas en los hospitales CARE de Visakhapatnam

ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో వయసుతో సంబంధం లేకుండా.. చాలా మందిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యల్లో కీళ్ల నొప్పులు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేవిగా భావించిన ఈ సమస్య, ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. దీని ప్రధాన కారణాలు మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలో తగ్గుదల, ప్రస్తుత జీవన విధానం, కాలుష్యం అధికంగా ఉన్న ఆహారం, పోషకాహార లోపం వంటి అంశాలు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలసట, మోకాళ్ల నొప్పులు, కదలికలలో ఇబ్బందులు మొదలవుతాయంటేనే చాలామంది భయపడతారు. అయితే వీటికి సరైన ఆహారం, వ్యాయామం ద్వారా మెరుగైన నియంత్రణ సాధ్యమే. ప్రతి రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం, పాలు, గుడ్లు, పౌష్టికాహార పండ్లు తినడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కీళ్ల గుజ్జు మెరుగుపడి, నొప్పులు తగ్గుతాయి. అయితే, ఎప్పటికైనా సమస్య తీవ్రరూపం దాల్చినపుడు అధునాతన చికిత్సే మిగిలిన మార్గం.

ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్ ఇటీవల అద్భుతం చేసింది. ఈ హాస్పిటల్‌లో ఒకేరోజు, కేవలం 12 గంటల్లోనే పది రోబోటిక్ టోటల్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మారథాన్ సర్జికల్ కార్యక్రమానికి నాయకత్వం వహించిన డాక్టర్ రవి చంద్ర వట్టిపల్లి మాట్లాడుతూ.. ఇలాంటి శస్త్రచికిత్సలు అంత వేగంగా, ఖచ్చితంగా పూర్తవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని చెప్పారు.

ఈ విజయవంతమైన ఆపరేషన్లలో అత్యాధునిక వెలిస్ రోబోటిక్ సిస్టమ్ వినియోగించమని వివరించారు. రోగి శరీర నిర్మాణాన్ని పూర్వపు రోజుల్లోలా అంచనా వేయకుండా, ఇప్పుడు మిషన్ ప్రిసిషన్‌తో milímetro స్థాయిలో ప్లానింగ్‌ చేసి ఆపరేషన్ చేసే సాంకేతికత ఇదని వివరించారు. శస్త్రచికిత్స అనంతర పునరుద్ధరణ కూడా వేగంగా జరిగిందని, రోగులు తక్కువ నొప్పితో తక్కువ సమయంలో కోలుకున్నారని ఆయన తెలిపారు.

ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో డాక్టర్ రాజు నాయుడు, డాక్టర్ అజయ్ కీలక పాత్ర పోషించారు. రోగుల ట్రాకింగ్, ఆపరేషన్ అనంతర పర్యవేక్షణలో వీరి సహకారం గణనీయమైంది. రోబోటిక్ టెక్నాలజీ, నైపుణ్యం కలిగిన వైద్య బృందం, రోగుల శ్రేయస్సు కోసం కలిసి పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని డాక్టర్ రవి చంద్ర తెలిపారు.

ఇప్పటికీ మోకాళ్ల నొప్పుల బాధతో జీవితం పరిమితమై పోయినవారికి ఇది ఆశాజనకమైన మార్గం. పైగా ఈ చికిత్స తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం గొప్ప విషయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాధునిక ఆర్థోపెడిక్ సేవలు అందించడంలో రోబోటిక్ సర్జరీలు కీలక మైలురాయిగా నిలుస్తున్నాయని వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మోకాళ్ల నొప్పులతో జీవితం నరకంగా మారిందని భావిస్తున్నవారికి.. ఇదో గొప్ప అవకాశం. శాస్త్ర సాంకేతికత ప్రగతితో ఇప్పుడు ఆరోగ్యాన్ని తిరిగి పొందడం సులభం. నొప్పులకు ఇక గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారా.. అయితే, రోబోటిక్ శస్త్రచికిత్స చేసుకోండి.

Link de referencia

https://telugu.news18.com/news/andhra-pradesh/visakhapatnam-visakhapatnam-care-hospital-10-robotic-knee-replacements-in-12-hours-vsj-tvk-gvj-local18-ws-l-2868106.html#google_vignette