చిహ్నం
×

డిజిటల్ మీడియా

టమోటా ప్రభావం

6 మే 2022

రక్తపోటుపై టమోటా పోషక సముదాయం ప్రభావం

హైపర్‌టెన్షన్ : టమాట తింటే బీపీ కంట్రోల్ అవుతుందా..

అనేక కారణాలతో మనల్ని బీపీ అటాక్ చేస్తుంది. అందుకే మనం ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వన్స్ బీపీ అటాక్ అయిందంటే దానితో పాటు ఎన్నో సమస్యలు వచ్చి చేరతాయి. గుండె సమస్యలు, బ్రెయిన్ చేతి గోరు నుంచి కాలి వేళ్ళ వరకూ అన్నీ కూడా ఈ సమస్య కారణంగా మరో కొత్త సమస్య మారతాయి. అలాంటప్పడు నేడు వైరల్ అవుతున్న ఓ వార్త గురించి తెలుసుకుందాం. అదే టమాట తింటే బీపీ కంట్రోల్ అవ్వడం.. ఇందులో నిజమెంత..
 
బీపీ ఉన్నవారు ఏం తింటే మంచిదంటే..

  • అనేక కారణాలతో వేధించే బీపి

  • ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్న నిపుణులు

వయసుతో సంబంధం లేకుండా నేడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి వాటిలో ఒకే హై బ్లడ్ ప్రెజర్. ఇవే కారణాలు అని ఈ సమస్యకి వేటిని ప్రత్యేకంగా చెప్పలేం కానీ, చాలా కారణాల వల్ల ఈ సమస్య మనల్ని చుట్టుముడుతుంది. అలాంటప్పుడు దీనిని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకుంటే.. ఇది ఒక్కసారి మన శరీరంలోకి చేరిన తర్వాత దీనికి తోడుగా మరిన్నీ ఆరోగ్య సమస్యలు వచ్చి చేరతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఒక్కోసారి పరిస్థితి మన అదుపులో ఉండక సమస్య వచ్చి చేరుతుంది. అలాంటప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉప్పుని తగ్గించాలని చెప్పాలని, అదే విధంగా స్పైసీ, ఐలీ ఫుడ్‌ను తగ్గించాలని చెబుతున్నారు డా. ప్రణీత్. ఈయన హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్‌గా చేస్తున్నారు.

టమాట తింటే..

అదే విధంగా.. ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టమాట తింటే బీపీ తగ్గుతుందనేది ఒకటి. ఇది నిజమేనా ఆరా తీస్తే సగం నిజం అని అంటున్నారు డా.ప్రణీత్ ఎందుకంటే బీపీ పేషెంట్స్‌కి పొటాషియం రిచ్ ఫుడ్స్ హెల్ప్ చేస్తుందని ఆయన అంటున్నారు. అందుకే పొటాషియం కలిగిన టమాట బీపీ పేషెంట్స్‌కి మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే, ఇది బీపీ మాములుగా కాకుండా కాస్త ఎక్కువగా ఉన్నవారికే. మరి హైబీపీ ఉన్నవారికి ఎన్ని టమాటాలు తిన్నా ఫలితం కొద్దిగా మాత్రమే ఉంటుంది. అదే విధంగా కేవలం టమాట మాత్రమే తిని మిగిలిన విషయాలు పట్టించుకోకుండా ఉండి బీపీ కంట్రోల్ అవుతుందనుకోవడం కూడా కరెక్ట్ కాదని, ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుని హెల్దీ లైఫ్‌స్టైల్, మంచి నిద్ర, సరైన వ్యాయామం, చక్కని డైట్ పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి చిట్కాలు పాటిస్తేనే ఫలితం ఉంటుంది డా. ప్రణీత్ చెబుతున్నారు.

బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అందుకే హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే ముందునుంచి సరైన జీవన విధానం పాటించడం చాలా ముఖ్యం. ఈ సూచన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హైపర్ టెన్షన్ సమస్య ఉన్నప్పుడు రక్తనాళాల పై ఒత్తిడి పడుతుంది. బ్లడ్ పంప్ చేసే క్రమం లో ఈ ఒత్తిడి కలుగుతుంది గుండె జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం. హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్లి తగిన చికిత్స చేయించుకుంటూ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య చూస్తే ఒక బిలియన్ మంది తో ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ లో అయితే ప్రతి ముగ్గురి లో ఒకరు హైబీపీ తో బాధ పడుతున్నారు. ఎక్కువ మంది బీపీ తో సతమతమవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడడం చాలా అవసరం.

సూచన: https://telugu.samayam.com/lifestyle/health/effect-of-tomato-nutrient-complex-on-hyper-tension-know-here/articleshow/91381704.cms