చిహ్నం
×

డిజిటల్ మీడియా

1 ఫిబ్రవరి 2023

క్యాన్సర్ : ఈ లక్షణాలు ఉంటే నోటి క్యాన్సర్ ఉన్నట్లేనట..

 

క్యాన్సర్ : క్యాన్సర్.. ప్రపంచంలో ఈ సమస్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ భయంకరమైన వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి దూరమొచ్చొని చెబుతున్నారు.

క్యాన్సర్‌కి అనేక ప్రమాదాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పొగత్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెబుతారు. అందుకే పొగాకు, పొగ్రతాగడానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పొగత్రాగడానికి దూరంగా ఉంటే జీవిత నాణ్యత పెరుగుతుంది. పొగత్రాగడం వల్ల ఈ ప్రాణాంతక వ్యాధి పెరుగుతుందనడంలో నిజం ఎంత.. డాక్టర్స్ ఏం చెబుతున్నారో చూద్దాం.

పొగాకు తీసుకోవడం క్యాన్సర్ మరణాలకి కారణమవుతుందని DR. స్నిత సినుకుమార్ మనకు వివరించారు (DR. SNITA SINUKUMAR, MS, Mch. కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎట్ జహంగీర్ హాస్పిటల్). డాక్టర్ స్నిత ప్రకారం పొగతాడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఊపిరితిత్తులు, మూత్రాశయం, ప్యాంక్రియాటిక్, ఇతర క్యాన్సర్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది. సెకండ్ హ్యాండ్ పొగ కూడా క్యాన్సర్‌ను మరింతగా పెంచుతుంది. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే.. పొగాకుతో తయరైన సిగరెట్స్, సిగార్స్, హుక్కా, పైప్స్ వాడడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని డాక్టర్ స్నిత చెబుతున్నారు.

వీటికి దూరంగా ఉండాల్సిందే..

పొగాకు వాడేవారిలో సగం మంది క్యాన్సర్‌కి గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొగకుని అనేక రూపాల్లో తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. పొగత్రాగడం, ఆల్కహాల్ తీసుకోవడం ఎక్కువగా నోటి క్యాన్సర్‌కి ప్రధాన ప్రమాదాలు. భారతదేశంలో 80 సంవత్సరాలకు పైగా క్యాన్సర్ కేసులు పొగత్రాగడం, మద్యపానం వల్ల వచ్చినవేనని డాక్టర్ విపిన్ గోయల్ అంటున్నారు. (డాక్టర్ విపిన్ గోయల్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఓకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, Ph.040-61656565)



యూత్ ఎక్కువగా వివిధ కారణాల వల్ల పొగాకుని వాడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నోటి క్యాన్సర్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 

లక్షణాలు..

నోటి క్యాన్సర్ లక్షణాల విషయానికి వస్తే పుండు ఉంటుంది. ఇది నయం కాదు. దీనితో నమలడం, మింగడం, మాట్లాడడం, నాలుకని కదిలించడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా త్వరగా మీరు డాక్టర్‌ని కలవాలి. టెస్ట్ చేసేందుకు, క్యాన్సర్ తీవ్రతను గుర్తించేందుకు బయాప్సీ, ఇమేజింగ్(సిటి స్కాన్, ఎమ్ఆర్ఐ స్కాన్) చేస్తారని డాక్టర్ విపిన్ గోయల్ చెబుతున్నారు.

ట్రీట్మెంట్..

ట్రీట్‌మెంట్ అనేది క్యాన్సర్ రకం, అది ఉన్న స్థానం, దశపై ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ట్రీట్‌మెంట్ అవసరమవుతుంది. స్టేజ్‌ని బట్టి క్యాన్సర్‌కి సర్జరీ, కీమో థెరపీ, రేడియేషన్ అవసరం. ఈ ట్రీట్‌మెంట్ చాలా నొప్పిగా ఉండడమే కాకుండా, కాస్ట్లీ కూడా.

ఏం చేయాలంటే..

క్యాన్సర్ రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పొగాకుని పూర్తిగా మానేయాలి. ఏ రూపంలో కూడా తీసుకోకూడదు. దీని వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు, హార్ట్, పల్మనరీ, ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పూర్తిగా తగ్గుతుందని డా.విపిన్ గోయల్ చెబుతున్నారు.

పొగత్రాగడం అలవాటుగా మారితే, దానిని మానేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం నిపుణుల సలహా తీసుకోవాలి.

డైట్ విషయానికొస్తే..

కొన్ని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందులో క్యాన్సర్ వంటి సమస్యలను కూడా హెల్దీ ఫుడ్స్‌తో దూరం చేసుకోవచ్చు. కొన్ని ఫుడ్స్‌లో క్యాన్సర్ నివారణ లక్షణాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఆహారం చెప్పుకోవచ్చు. అంటే, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు చేర్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు దూరం చేసుకోవచ్చు.

ఆకుకూరలు, పండ్లు..

ఆకుకూరల్లోని గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిని ఎంతగా తింటే అంత ఆరోగ్యానికి మంచిది. ఇందులోని పోషకాలు, పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. వీటిని సలాడ్, కూరలు, పప్పులు.. ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి. అలానే, పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినడం చాలా మంచిదని అంటున్నారు. వీటిలోని ఖనిజాలు, ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తృణధాన్యాలు..

రెగ్యులర్‌గా మనం హోల్ గ్రెయిన్స్ తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు లెగ్యూమ్స్, నాట్స్, ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటితో పాటు డాక్టర్లు సూచించిన అన్ని సలహాలు పాటించాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాము. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

సూచన లింక్: https://telugu.samayam.com/lifestyle/health/how-does-smoking-cause-cancer-and-how-to-cure-it/articleshow/97508081.cms?story=8