చిహ్నం
×

డిజిటల్ మీడియా

19 జనవరి 2023

డయాబెటిస్ ఫుట్ అల్సర్స్ : షుగర్ పేషెంట్స్‌కి కాళ్ళపై గాయాలు ఎందుకు అవుతాయి..

Diabetes Foot Ulcers : షుగర్ ఉన్నవారికి ఎక్కువగా డయాబెటిక్ ఫుట్ అనే సమస్య వస్తుంది. కాళ్ళకు వచ్చే గాయాలు, ప్రెజర్ అల్సర్, ఇన్ఫెక్షన్స్ని సూచించే సమస్యే డయాబెటిక్ ఫుట్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

అల్సర్ డయాబెటిస్ మెల్లిటస్, డయాబెటిక్ ఫుట్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల అధిక బరువు పెరుగుతోంది. దీని వల్లే ఇతర సమస్యలు కూడా వస్తాయి. అయితే, షుగర్ పేషెంట్స్కి సాధారణంగా వచ్చే సమస్యల్లో డయాబెటిక్ ఫుట్ కూడా ఒకటి. ఇది షుగర్ ఉన్నవారికి పాదాలపై పుండ్లని, గాయాలను చేస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

డయాబెటిక్ ఫుట్ రావడానికి కారణాలు..

కొన్ని సార్లు న్యూరోపతి కారణంగా ఈ సమస్య వస్తుంది. దీనితో పాటు, గాజు ముక్కల మీద అడుగు పెట్టడం, గాయాలవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే, గాయమైనప్పుడు నొప్పి లేకపోతే, స్పర్శ లేకపోతే గమనించండి. ఇలాంటివి ఆలస్యంగా గమనిస్తే అది ప్రమాదంగా మారొచ్చు. నరాల వ్యాధి కూడా పాదం అంతర్గత కండరాల పనితీరు కోల్పోయేలా చేస్తుంది.

ఇక ఇమ్యూనిటీ తగ్గడం వల్ల డయాబెటిక్ మెల్లిటస్ ఎక్కువ అవుతుంది. దీనితో తీవ్రమైన ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. రక్త సరఫరా తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా త్వరగా ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే ప్రమాదంగా మారొచ్చు.

రక్త సరఫరా ఎందుకు తగ్గుతుంది..

వృద్దాప్యం కారణంగా ధమనులు గట్టి పడతాయి. దీనిని ఆర్టెరియోస్క్లెరోసిస్ అంటారు. ధమనులు తక్కువగా పనిచేయడం, మూసుకుపోవడం వల్ల నడకలో, కండరాల తిమ్మిరిలో నొప్పి వస్తుంది. తీవ్రమైన వ్యాధి పుండు, గ్యాంగ్రేన్కి కారణమవుతుంది.

పాదాల సమస్యను తగ్గించొచ్చా..

పాదాల సమస్యలు వస్తే ముందుగా రక్తంలో చక్కెరను నియంత్రించాల్సి ఉంటుంది. పొగాకు, పొగ తాగే అలవాటు ఉంటే తగ్గించాలి. దీని వల్ల రక్తపోటు ఇతర సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా శారీరక శ్రమ అవసరం. దీనికోసం నడుస్తుండాలి. నడవడం వల్ల గుండెకి కూడా మంచిదని గుర్తుపెట్టుకోవాలి.

ఎలాంటి జాగ్రత్తలు..

  • పాదాలను చెక్ చేసుకోవాలి. పాదాలపై మచ్చలు ఉంటే జాగ్రత్త పడాలి. రోజూ పాదాలను గోరువెచ్చని నీరు, సబ్బుతో కడగాలి. పాదాలు ఆరేలా చూసుకోండి. ఎందుకంటే చర్మం అనేది శిలీంద్రాలు, తడి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. మడమలు, కాలి పగుళ్ళు లేకుండా చూసుకోండి. వాసెలిన్, మాయిశ్చరైజర్ రెగ్యులర్గా రాస్తోంది. మృదువైన, మంచి చెప్పులను వాడండి. షూ వాడేటప్పుడు లోపల చిన్న రాళ్లు, ముల్లులు లేకుండా చూసుకోండి. గోర్లు మరి చిన్నగా ఉండేలా కట్ చేయొద్దు. చర్మం కట్ కాకుండా చూసుకోవాలి. కార్న్, కాల్యూస్ వంటి సమస్యలు ఉంటే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కాలిని క్లీన్ కోసం ప్యూమిస్ రాయి వాడొద్దురోజువారిగా పాదాలను చెక్ చేస్తుండాలి. అనేక గాయాలు, పగుళ్ళు, చర్మం బొబ్బలు, వాపులు, రంగులో మార్పు ఎలా ఉన్నా జాగ్రత్తగా పరిశీలించాలి. చెప్పులు లేకుండా అస్సలు నడవొద్దు. ఆరుబయట అయినా, తోటలో అయినా, ఇంట్లో అయినా చెప్పులు వేసుకుని నడవడం మంచిది. హీటర్లు, వేడి నీటి బాటిల్ కాలిపై నేరుగా పెట్టొద్దు. దీని వల్ల కాలు కాలే ప్రమాదం ఉంది.

డయాబెటిక్ ఫుట్‌కి సర్జరీ..

డయాబెటిక్ ఫుట్ ఉంటే మొదట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. కణజాలం ఎక్సిషన్, చీము పారడం వంటి వాటిని చనిపోయిన తర్వాత క్లీన్ చేయాలి. అవసరమైత డ్రెస్సింగ్ చేస్తారు. రక్త సరఫరా తగ్గిన రోగులకు యాంజియోప్లాస్టీ, బైపాస్ టు లెగ్, పాద ధమనుల ద్వారా కాలు, పాదాలకు రక్త సరఫరా అయ్యేలా చూస్తారు. డయాబెటిక్ ఫుట్ని మంచి ట్రీట్మెంట్తో సాల్వ్ చేయొచ్చు. లేటెస్ట్ వాస్కులర్ సర్జికల్ టెక్నిక్స్ అవసరం ఉంటుంది.

-డాక్టర్ పిసి గుప్తా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జరీ & వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ 96660 88000 / vasculartherapy@gmail.com
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాము. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.