Centre of Excellence
Specialties
Treatments and Procedures
Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. Sambhajinagar
Clinics & Medical Centers
Online Lab Reports
Book an Appointment
Consult Super-Specialist Doctors at CARE Hospitals
29 April 2022
Mangoes : మామిడిపండ్లు వీరు అస్సలు తినొద్దొట..
ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడిపండ్లే కనిపిస్తాయి. పండ్ల రారాజు మామిడిని మనం తినకుండా ఉండలేం. అందుకే కచ్చితంగా అందరూ ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తారు. కానీ, కొంతమంది ఈ మామిడి పండ్లు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఎవరు తినాలి.. ఎవరు తినకూడదు..అసలు ఈ పండ్లలో ఉండే విటమిన్స్ ఏంటి.. ఎంత పరిమాణంలో తినాలి.. ఏ సమయంలో తినాలి.. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి.
మామిడిపండు అంటే చాలు.. చాలా మంది నోరూరుతుంది. చాలా మంది సమ్మర్‌ని ఇష్టపడుతున్నాం కేవలం మామిడి పండ్ల కోసమే అంటూ చెబుతుంటారు. అందుకే ఈ సీజన్‌లో దొరికే ఆ పండును విరివిగా తింటారు. అయితే ఈ పండుని కొంతమంది తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల జిహ్వరుచి ఏమోగాని నష్టం ఉంటుందని అంటున్నారు.
మామిడి పండ్లలోని పోషకాలు..
అన్ని పండ్లలానే ఈ సీజనల్ ఫ్రూట్ కూడా ఎన్నో విటమిన్స్‌ని కలిగి ఉంటుంది ఇందులో చక్కెర శాతం 15 ఉండగా, ఒక శాతం మాంసకృత్తులు, తగిన మోతాదులో విటమిన్ ఏ, బి, సిలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసేవే. కానీ, కొంతమందికి మాత్రం ఇవి మేలు కంటే ఎక్కువగా కీడే చేస్తాయని చెబుతున్నారు. అందుకే వీటిని ఎవరు తినాలి, ఎవరు తినకూడదు ఇలాంటి విషయాల్లో బాగానే చర్చ జరుగుతుంది. ఇందులో నిజనిజాలు ఏంటో తెలుసుకోండి..
షుగర్ పేషెంట్స్..
చక్కెర శాతం అధికంగా ఉన్న ఈ పండు తినడం షుగర్ పేషెంట్స్‌కి మంచిది కాదని చెబుతున్నారు డా. శ్రీనివాస్, ఈయన హైదరాబాద్ కేర్ హాస్పిటల్‌లో ఎండోక్రినాలజీ విభాగంలో ఎమ్‌డిగా ఉన్నారు. ఇందులో అధికంగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని, ఇది షుగర్ పేషెంట్స్‌కి మంచిది కాదని ఆయన అంటున్నారు. అయితే మరి అంతలా తినాలనిపిస్తే ఆహారానికి బదులు భోజనం సమయంలో అది కూడా అరుదుగా తినాలని చెబుతున్నారు డాక్టర్. అంటే మామిడిపండుని మోతాదులో తినొచ్చని ఆయన సూచిస్తున్నారు. మరి అతిగా తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని చెబుతున్నారు.
పెరుగుతో కలిపి తినడం..
చాలా మందికి సమ్మర్ వచ్చిందంటే చాలు.. ఏ రకంగానైనా మామిడిపండుని తినడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే కొంతమంది పెరుగులో మామిడిపండుని కలిపి తింటారు. ఇది కూడా షుగర్ లేని వారు తినొచ్చు కాని ఉన్న వారు ఇలా తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని డా. శ్రీనివాస్ చెబుతున్నారు. ఇందులోని కేలరీస్ శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతాయని అంటున్నారు. ఇవి మాత్రమే కాదు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన అంటున్నారు.
మామిడి పండు ఏ సమయానికి..
కొంతమంది పండు ఉదయం సమయంలో తినాలి అంటారు. ఇదే విషయంపై డాక్టర్‌ని ప్రశ్నించగా.. అలాంటి ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు డా. శ్రీనివాస్. ఏ సమయంలో తిన్నా కూడా తగిన మోతాదులో తినాలని మోతాదుకి మించి తినడం ఎప్పటికి మంచిది కాదని ఆయన సూచిస్తున్నారు. మొత్తానికి మామిడి ప్రియులు ఈ విషయాలు తెలుసుకుని మీరు ఈ జాగ్రత్తలు తీసుకుని పండుని, ఆ రుచిని ఎంజాయ్ చేయండి. ఆహారమే ఔషధం.. అది పరిమితంగా తిన్నప్పుడు మాత్రమే.. పరిమితి దాటితే విషమని మరవొద్దు.