Centre of Excellence
Specialties
Treatments and Procedures
Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. Sambhajinagar
Clinics & Medical Centers
Online Lab Reports
Book an Appointment
Consult Super-Specialist Doctors at CARE Hospitals
27 January 2023
సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాలకి వచ్చే ఒక రకమైన క్యాన్సర్. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)కి సంబంధించిన వివిధ జాతులు సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమవుతాయి. HPV కి గురైనప్పుడు, శరీర ఇమ్యూనిటీ కారణంగా సాధారణంగా వైరస్ హాని చేయకుండా అడ్డుకుంటుంది. కొందరిలో వైరస్ సంవత్సరాలు జీవించి ఉంటుంది. కొన్ని సర్వైకల్ కణాలు.. క్యాన్సర్ కణాలుగా మారతాయి. స్క్రీనింగ్ టెస్ట్, HPV ఇన్ఫెక్షన్ నుండి రక్షించే వ్యాక్సిన్‌ని తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
లక్షణాలు:
మొదటి దశ సర్వైకల్ క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను చూపించదు.
అడ్వాన్స్‌డ్ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు:
కలయిక తర్వాత, పీరియడ్స్ మధ్య, మెనోపాజ్ తర్వాత యోని రక్తస్రావం
దుర్వాసనతో కూడిన నీటి, రక్తపు యోని ద్రవాలు
కలయిక సమయంలో పెల్విక్ నొప్పి, నొప్పి
గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి DNAలో మార్పులను (మ్యుటేషన్లు) అభివృద్ధి చేసినప్పుడు గర్భాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన కణాలు నిర్ణీత రేటుతో పెరుగుతాయి. కొద్ది సమయంలో చనిపోతాయి. పేరుకుపోయిన అసాధారణ కణాలు ఒక కణితిని ఏర్పరుస్తాయి. క్యాన్సర్ కణాలు సమీపంలోని కణజాలాలపై దాడి చేస్తాయి. శరీరంలోని ఇతర చోట్ల వ్యాప్తి చెందడానికి కణితి నుండి విడిపోతాయి.
గర్భాశయ క్యాన్సర్‌కు కారణమేంటో స్పష్టంగా తెలియదు, కానీ HPV పాత్ర పోషిస్తుంది. HPV చాలా సాధారణం. ఈ వైరస్ ఉన్న ప్రతిఒక్కరికి క్యాన్సర్ రాదు. లైఫ్‌స్టైల్, ఇతర కారకాల కారణంగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది.
సర్వైకల్ క్యాన్సర్ రకం మీ రోగ నిరూపణ మరియు చికిత్సను నిర్ణయించడంలో సహాయపడుతుంది.
సర్వైకల్ క్యాన్సర్ రకాలు:
పొలుసుల కణ క్యాన్సర్..
ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం బయటి భాగాన్ని కప్పి ఉంచే సన్నని, చదునైన కణాలలో పొలుసుల కణాలు ప్రారంభమవుతాయి. ఇది యోనిలోకి ప్రవేశిస్తుంది. చాలా గర్భాశయ క్యాన్సర్లు పొలుసుల కణ క్యాన్సర్.
అడెనోకార్సినోమా. .
ఈ గర్భాశయ క్యాన్సర్ కాలమ్ ఆకారపు గ్రంధి కణాలలో ప్రారంభమవుతుంది.
గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి:
HPV వ్యాక్సిన్ ఉంటుంది. దీని గురించి మీ డాక్టర్‌ని అడగండి. HPV సంక్రమణను నివారించడానికి టీకాను తీసుకోవడంతో సర్వైకల్ క్యాన్సర్, ఇతర HPV సంబంధిత క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించొచ్చు.
క్యాన్సర్ రకాన్ని బట్టి, తీవ్రతని బట్టి మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్స్ ట్రీట్‌మెంట్‌ని సూచిస్తారు.
సాధారణ పాప్ టెస్ట్‌లను చేసుకోవడం మంచిది. పాప్ టెస్ట్‌లు గర్భాశయ ముందస్తు సమస్యలను గుర్తిస్తాయి. కాబట్టి గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఇవి తప్పనిసరి. వైద్య సంస్థలు 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సాధారణ పాప్ పరీక్షలు సంవత్సరం వారీగా చేయించుకోవాని సూచిస్తున్నాయి.
సురక్షితమైన శృంగారం, లైంగిక సంక్రమణలను నివారించేందుకు చర్యలు తీసుకుంటే మీ గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
స్మోక్ చేయొద్దు. పొగ త్రాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే దానికి దూరంగా ఉండడం మంచిది.
అదే విధంగా, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే డాక్టర్ సలహాతో సరైన లైఫ్‌స్టైల్ పాటించడం మంచిది. ఏవైనా సమస్యలు ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మరిచిపోవద్దు.
-Dr. Vipin Goel, Sr. Consultant and Laparoscopic Surgeon, Surgical Oncology, CARE Hospitals, Banjara Hills, Hyderabad, Ph: 040 61 65 65 65
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Reference Link: https://telugu.samayam.com/lifestyle/health/what-are-the-warning-signs-of-cervical-cancer/articleshow/97363901.cms?story=5