Centre of Excellence
Specialties
Treatments and Procedures
Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. Sambhajinagar
Clinics & Medical Centers
Online Lab Reports
Book an Appointment
Consult Super-Specialist Doctors at CARE Hospitals
22 May 2026
హైదరాబాద్, మే 21(విజయక్రాంతి): అత్యవసర వైద్య సేవల్లో ప్రతి నిమిషం ఎంత కీలకమో చాటి చెప్పే ఘటనలో, బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవాడకు చెందిన 48 ఏళ్ల పంతంగి ధనుంజ యుడు ప్రాణాలను కాపాడారు. ఒక్కో నిమి షం ప్రాణాన్ని నిర్ణయించే అత్యవసర పరిస్థితి, ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిన స్థితి, గుండె పనితీరు వేగంగా క్షీణిస్తున్న పరిస్థితిలో కుటుంబ సభ్యులు చివరి ఆశగా హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించారు.
100 కిలోలకు పైగా బరువున్న ఆయన తీవ్రమైన శ్వాస ఇబ్బంది, ప్రమాదకరంగా తగ్గిన ఆక్సిజన్ స్థాయిలు, వేగంగా క్షీణిస్తున్న గుండె పనితీరు, పలు ఇతర అనారోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకున్నారు. మధుమేహం సంబంధిత కిడ్నీ వ్యాధి, తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న ఆయనకు గుండె చుట్టూ భారీగా ద్రవం పేరుకుపోయి, గుండె గదులపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ తీవ్రంగా ప్రభావితమైనట్లు వై ద్యులు గుర్తించారు.
హైదరాబాద్ చేరుకునే సమయానికి ఆయన శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ, అత్యంత క్లిష్టమైన గుండె అత్యవసర పరిస్థితిలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతోఅత్యవసర వైద్య బృందం ముందుగా ఆయన్ని స్థిరపరిచింది. అనంతరం కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ హార్ట్ టీమ్ అత్యవసరంగా పెరికార్డియల్ విండో ప్రక్రియ చేయాలని నిర్ణయించింది.
ఈ అత్యంత ప్రమాదకర అత్యవసర ప్రక్రియలో వైద్యులు గుండె చుట్టూ పేరుకుపోయిన సుమారు 750 మిల్లీలీటర్ల ద్రవాన్ని విజయవంతంగా తొలగించారు. దీంతో గుండెపై ఒత్తిడి వెంటనే తగ్గి, గుండె పనితీరు క్రమంగా పునరుద్ధరించబడింది. ఇలాంటి కేసుల్లో చికిత్స ఆలస్యం అయితే కార్డియాక్ టాంపోనేడ్, బహుళ అ వయవాల వైఫల్యం, ఆకస్మిక గుండె మర ణం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు.
అనంతరం రోగిని అధునాతన పర్యవేక్షణ కోసం ఐసీయూకు తరలించారు. 72 గంటల ఇంటెన్సివ్ కేర్ తర్వాత రోగిని వెంటిలేటర్ సపోర్ట్ నుంచి తొలగించారు.అనంతరం రోగి క్రమంగా కోలుకుని, స్థిరమైన ఆరోగ్యం తో నడుస్తూ డిశ్చార్జ్ అయ్యారు. ‘ఈ రోగి మా వద్దకు వచ్చినప్పుడు ఆయన బతికే అవకాశాలు చాలా తక్కువగా కనిపించాయి. అయితే వేగవంతమైన అత్యవసర స్పందన, సరైన సమయంలో తీసుకున్న వైద్య నిర్ణయం, నిపుణులైన బృందం సమన్వయం వల్ల ఆయన ప్రాణాలు కాపాడగలిగాం.
సకాలంలో జోక్యం చేసుకోవడం వల్లే ఈ ఫలితం సాధ్యమైంది’, అని బంజారా హిల్స్ లోని కేర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ కార్డియాలజీ విభాగాధిపతి, డాక్టర్ వి. సూర్య ప్రకాశ రావు అన్నారు.‘ఈ ఘటన మా అత్యవసర వైద్య సేవల సామర్థ్యాన్ని, మల్టీడిసిప్లినరీ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అనుభవజ్ఞులైన బృందాలు, అధునాతన మౌలిక సదు పాయాలు, వేగవంతమైన నిర్ణయాలు కలిసివస్తే అత్యంత విషమ స్థితిలో ఉన్న రోగులు కూడా కోలుకునే అవకాశం ఉంటుంది’, అని హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ జోషి తెలిపారు.
Reference Link
https://www.vijayakranthinews.com/news/articlenews/emergency-heart-surgery-for-an-individual-168395
Get A Call Back From Our Health Advisor Now
Enter your details, and our advisor will call you back shortly!
Thank You!
Our health advisor will get in touch with you shortly.