CARE Hospitals Logo
×

Black Fungus COVID-19

Updated on 20 May 2021

బ్లాక్ భయం

కొవిడ్-19 కన్నా దాని పర్యవసానాలే ఎక్కువగా భయపెడుతున్నాయి. కొత్తగా మ్యుకార్మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ సైతం వణికిస్తోంది. ముక్కు, నోట్లో తలెత్తే ఇది అక్కడికే పరిమితం కావటం లేదు. కళ్లకు, మెదడుకూ విస్తరిస్తూ తీవ్ర ప్రమాదంలోకి నెడుతోంది. ఒకప్పుడు మధుమేహుల్లోనే.. అదీ ఎప్పుడో అప్పుడు కనిపించే ఇదిప్పుడు ఉన్నట్టుండి ఎందుకు విజృంభిస్తోంది? మూంకార్ మైకోసిస్. ఎవరినోట విన్నా ఇదే మాట. బ్లాక్ ఫంగస్ అనీ , పిలుచుకుంటున్న ఇది చాలా చాలా అరుదైన సమస్య. కానీ కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ఇప్పుడు ఎంతోమంది దీని బారిన పడుతుండటం గమనార్హం. ప్రస్తుతం బయట పడుతున్న మ్యూకార్‌ మైకోసిస్ ను కొవిడ్-19తో ముడిపడిన డా|| ఎన్.విష్ణుస్వరూప్ రెడ్డి సమస్యగానే చెప్పుకోవచ్చు. కొవిడ్-19 ఈఎనీ సర్జన్, కేర్ హాస్పిటల్, తొలిదశలోనూ ఇది తలెత్తిన మాట నిజమే గానీ బంజారాహిల్స్, అంత ఎక్కువగా కనిపించలేదు. ప్రస్తుతం రెండో హైదరాబాద్ దశలో ఎక్కువ మంది దీని బారినపడుతుండటం, ప్రమాదకరంగా పరిణమిస్తుండటం.. కొందరు ప్రాణాపాయ స్థితిలోకీ వెళ్లిపోతుండటమే ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్-19 తగ్గిన తర్వాతే మ్యూకారమైకోసిస్ ఎక్కువగా బయటపడుతోంది. ప్రధానంగా మధుమేహంతో బాధపడే వారిలో, అదీ కరోనా చికిత్సలో భాగంగా కార్టికో స్టిరాయిడ్లు వాడిన వారిలోనే కనిపిస్తోంది. కరోనా పాజిటివ్ గా ఉన్నప్పుడూ కొందరు దీని బారినపడుతున్నారు. కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారిలోనూ ఇది బయటపడుతోంది. ఫంగస్ మూలం.. బ్లాక్ ఫంగస్ కు మూలం మ్యూకార్ మైసిటీస్ (జైగోమైసిటీస్) అనే ఫంగస్. ఇది ఇంటా బయటా ఎక్కడి వాతావరణంలోనైనా ఉండొచ్చు. గాలి ద్వారా ముక్కులోకి, గొంతులోకి ప్రవేశించి, వృద్ది చెందుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతులను ఇదేమీ చేయదు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. మధుమేహులకు సాధారణంగానే రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అందుకే దీర్ఘకాలంగా మధుమేహం నియంత్రణలో లేనివారికి దీని ముప్పు ఎక్కువ. క్యాన్సర్ బాధితులకు, రక్తక్యాన్సర్ గలవారికి, కీమోథెరపీ తీసుకునేవారికి, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, ఇతర రకం ఫంగల్ ఇన్ ఫెక్షన్ తగ్గటానికి వాడే ఓరికొనజోల్ మందు తీసుకునే వారికి, రోగనిరోధకశక్తిని అణచి పెట్టే మందులు వేసుకునే వారికీ వస్తుంటుంది. మ్యూకార్‌ మైకోసిస్ ప్రధానంగా ముక్కు, ముక్కు చుట్టుపక్కల ఉండే గాలిగదుల (పారానేసల్ సైనసస్) మీద దాడి చేస్తుంటుంది. ఇది అక్కడికే పరిమితం కావటం లేదు. కళ్లు, మెదడుకూ విస్తరిస్తోంది. అందుకే దీన్ని 'రైనో ఆర్బిటో సెరిబ్రల్ మ్యూకార్ మైకోసిస్' అనీ అంటుతో దీన్ని 'రైనో ఆంటం లేదు. కళ్లు దాడి చేస్తుంటుంది. ఉండే | సిరాయిడ్ల అతి వాడకంతోనే.. కొవిడ్-19 తీవ్రమైన వారికి కార్టికో స్టిరాయిడ్లు ప్రాణరక్షణ ఔషధాలుగా ఉపయోగపడుతున్న మాట నిజమే. ఇవి వాపు ప్రక్రియను (ఇఫ్లమేషన్) అదుపుచేస్తూ సమస్య తీవ్రత, దుష్పరిణామాలు తగ్గటానికి దోహదం చేస్తాయి. వీటిని అవసరమైన మోతాదులో, అవసరమైన మేరకు వాడుకుంటే రామబాణంలా పనిచేస్తాయి. బయటి నుంచి ఆక్సిజన్ అందిస్తున్న వారికి, వెంటిలేటర్ మీదున్న వారికి రక్తనాళం ద్వారా డెక్సామెథసోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్ వంటి స్టిరాయిడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డాక్టర్ల సలహా తీసుకోకుండా అతిగా, అవనసరంగా, ఇష్టమున్నట్టు తీసుకోవటమే కొంప ముంచుతోంది. ప్రస్తుతం కొవిడ్-19 మందుల జాబితాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చలామణి అవుతున్నాయి. వీటిని చూసి సొంతగా మందులు కొనుక్కొని వాడుకోవటం ఇటీవల ఎక్కువైంది. మిగతా మందులేమో గానీ స్టిరాయిడ్లను మాత్రం ఆచితూచి వాడుకోవాలి. కరోనా తలెత్తాక తొలి 5 రోజుల్లో స్టిరాయిడ్లు మొదలెట్టటం ఏమాత్రం మంచిది కాదు. కావాలంటే 5 రోజుల తర్వాత ఆయాసం వంటివి ఉంటే తీసుకోవచ్చు. అయితే సరైన మోతాదులో, డాక్టర్ల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. ఎందుకంటే వీటితో మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణాశయంలో పుండ్లు, నీటికాసులు, క్షయ ఉన్నవారికి ఆయా సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. మధుమేహులకు మరింత అప్రమత్తత అవసరం. స్టిరాయిడ్లతో రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పెరిగిపోతాయి. ప్రస్తుతం మ్యూకార్మైకోసిసకు బీజం వేస్తోంది ఇదే. మధుమేహం లేనివారిలోనూ స్టిరాయిడ్లతో కొత్తగా మధుమేహమూ తలెత్తుతోంది. • రక్తంలో ఫెటిన్ స్థాయిలు పెరగటమూ ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ఫంగస్ కణజాలానికి అతుక్కునేలా చేస్తుంది. చికిత్స: నిపుణుల బృందంతో... మ్యూకార్‌మైకోసిస్ పలు అవయవాలతో ముడిపడి ఉంటోంది. అందువల్ల ఈఎన్‌టీ సర్జన్, న్యూరాలజిస్టు, న్యూరోసర్జన్, ఆప్తాల్మాలజిస్ట్.. డెంటల్, ఫేషియో మాగ్జిలరీ సర్జన్.. ఆక్యులోప్లాస్టిక్ సర్జన్, ఇంటెన్సివస్ట్.. వంటి నిపుణులంతా కలిసికట్టుగా చికిత్స చేయాల్సి ఉంటుంది. గ్లూకోజు నియంత్రణ: మధుమేహాన్ని నియంత్రణలో ఉంచటం అన్నింటికన్నా ముఖ్యం. వీరిలో మధుమేహం మూలంగా ఒంట్లో ఆమ్లతత్వం బాగా ఎక్కువై ఉంటుంది. గ్లూకోజు నియంత్రణలోకి వస్తేనే మ్యూకార్‌మైకోసిస్ అదుపులోకి వస్తుంది. లేకపోతే వేగంగా విస్తరిస్తుంది, ముదురుతూ వస్తుంది. ఫంగల్ మందులు: జబ్బు నిర్ధరణ అయిన వెంటనే ఫంగల్ ఇన్ ఫెక్షనన్ను తగ్గించే మందులు ఆరంభించాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన మందు లైపోసోమల్ యాంఫోటెరిసిన్ బి. ఇది ప్రతి కిలో శరీర బరువుకు రోజుకు 5 మి.గ్రా. అవసరం. ఇన్ ఫెక్షన్ తీవ్రమైన వారికి, మెదడుకు విస్తరించినవారికి 10 మి.గ్రా. కూడా అవసరపడొచ్చు . ఇలా 2-4 వారాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని సెలైన్ ద్రావణంలో కలిపి నెమ్మదిగా ఇస్తారు. ప్రస్తుతం లైపోసోమల్ యాంఫోటెరిసిన్ బి అంతగా అందుబాటులో లేదు. ధర కూడా ఎక్కువే. అందువల్ల డీఆక్సీకొలైట్ మందును ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఇది ప్రతి కిలో శరీర బరువుకు రోజుకు 1 మి.గ్రా. చొప్పున అవసరం. దీంతో చలి వంటి దుష్ప్రభావాలు ఎక్కువ కాబట్టి ఇంకాస్త నెమ్మదిగానూ ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా ఫోసకొనజోల్ మందు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని తొలిరోజున రోజుకు రెండుసార్లు 300 మి.గ్రా. చొప్పున ఇస్తారు. మర్నాటి నుంచి రోజుకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. దీనికి బదులుగా ఇసావుకొనజోల్ మాత్రలైనా వాడుకోవచ్చు. వీటిని 200 మి.గ్రా. మోతాదులో రోజుకు 3 సార్ల చొప్పున రెండు రోజుల పాటు ఇస్తారు. ఆ తర్వాత రోజుకు ఒకసారి ఇస్తారు. వీటిని జబ్బు నియంత్రణలోకి వచ్చేంతవరకు తీసుకోవాలి. జాగ్రత్త అవసరం: లైపోసోమల్ యాంఫోటెరిసిన్ బి మందు కిడ్నీలను దెబ్బతీసే అవకాశముంది కాబట్టి తరచూ రక్తంలో క్రియాటినైన్, పొటాషియం మోతాదులను గమనించాల్సి ఉంటుంది. క్రియాటినైన్ పెరుగుతున్నట్టయితే అప్పటికి మందు ఆపేస్తారు. పెద్దమొత్తంలో సెలైన్ ఇచ్చినట్టయితే క్రియాటినైన్ తగ్గుతుంది. మర్నాడు తిరిగి మందును కొనసాగిస్తారు. పొటాషియం తగ్గుతున్నట్టయితే సిరప్ రూపంలో ఇస్తారు. ఒంట్లో నీటిశాతం తగ్గకుండానూ చూసుకోవాల్సి ఉంటుంది. నిర్ధరణ ఎలా? ముక్కు ఎండోస్కోపీ: దీంతో ముక్కు లోపల ఎలా ఉందో తెలుస్తుంది. ముక్కులోని టర్బినేట్లు నల్లగా, తారులా, మసిబొగ్గులా కనిపిస్తే ఫంగల్ ఇన్ ఫెక్షన్ ఉన్నట్టే. అలాగే ముక్కులో నల్లగా, గోధుమ రంగులో చెక్కుల వంటివీ ఉండొచ్చు. దీన్ని సేకరించి, సూక్ష్మదర్శినితో (కేవో హెచ్ మౌంటింగ్) పరీక్షించాల్సి ఉంటుంది. ఇందులో జై గోమైసిటిస్ లేదా మ్యూకామైసిటీస్ ఉన్నదీ లేనిదీ నిర్ధరణ అవుతుంది. సీటీ స్కాన్: ముక్కు, గాలి గదుల సీటీ స్కాన్ పరీక్షలో ఇన్ ఫెక్షన్ ఎంతవరకు విస్తరించిందనేది బయటపడుతుంది. ఎంఆర్‌: ఇన్ ఫెక్షన్ మెదడుకు, కావర్నస్ సైనసకు, కంటికి విస్తరిస్తే దీంతో తెలుసుకోవచ్చు. మందులతో పాటు శస్త్రచికిత్స మ్యూకార్ మైకోసిస్ కు కేవలం మందులతోనే అంతగా ఉపయోగం ఉండదు. మందులు మొదలెట్టాక శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స అనంతరమూ మందులను కొనసాగించాలి. లేకపోతే ఫంగస్ మళ్లీ పుట్టుకొచ్చే ప్రమాదముంది. ఫంగస్ కణజాలాన్ని తొలగించటం: ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ముక్కులో, గాలిగదుల్లో నల్లబడిన కణజాలాన్ని.. అలాగే ముక్కు గదుల్లోని చీమును తొలగిస్తారు. ఒకవేళ అంగిలి కూడా ప్రభావితమైతే బుగ్గ ఎముక, అంగిలిలో కొంత భాగాన్ని తొలగించాల్సి రావొచ్చు. అవసరమైతే 2-3 వారాల తర్వాత మళ్లీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంగిలి తొలగించినవారికి ఆ భాగం నయమయ్యేవరకు ముక్కు ద్వారా గొట్టంతో ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. నయమైన తర్వాత అంగిలి పైభాగాన సన్నటి పళ్లెంలాంటి పరికరాన్ని (ఆ ట్యురేటర్) అమరుస్తారు. కన్ను తొలగింపు: అందరికీ కాదు గానీ కంటికి ఇన్ ఫెక్షన్ విస్తరిస్తే కొందరికి కన్ను కూడా తీయాల్సి రావొచ్చు. లేకపోతే దృశ్యనాడి ద్వారా ఇన్ ఫెక్షన్ మెదడుకూ వ్యాపించి తీవ్రమయ్యే ప్రమాదముంది. గొట్టంలో తొలగించినవారికి తర్వాత మళ్లీ తొలగించాల్సి రా ప్రభావితమైతే త్వరగా గుర్తిస్తే మేలు చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ఇన్ ఫెక్షన్ రెండు వైపు గాలి గదులకూ విస్తరిస్తుంది. ఇది మెదడుకు వ్యాపిస్తే పక్షవాతం తలెతొచ్చు. కొందరు అచేతన స్థితిలోకి వెళ్లిపోయి.. రోజుల్లోనే మరణించే ప్రమాదముంది. కాబట్టి | ఇన్ ఫెక్షనను వీలైనంత త్వరగా గుర్తించటం ముఖ్యం. దీంతో కంటి చూపు, ప్రాణాలు కాపాడుకోవచ్చు. తీవ్రమైన తల నొప్పి, బుగ్గల నొప్పి, కంటి నొప్పి వంటివి గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.  

కొవిడ్-19-మ్యూకారమైకోసిస్

లక్షణాలు రకరకాలు మ్యూకార్ మైకోసి లో ముక్కు, అంగిలి, కళ్లు, మెదడు వంటివన్నీ ప్రభావితం అవుతుండటం వల్ల రకరకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఒకవైపున తీవ్రమైన తలనొప్పి వస్తుండటం. దీంతో పాటు ఆయా అవయవాలను బట్టి లక్షణాలు పొడసూపుతున్నాయి. ముక్కులోపల నలుపు: తొలిదశలో ముక్కు దిబ్బడ, ముక్కు కారటం.. శ్లేష్మం గోధుమ, నలుపు రంగులో రావటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మన ముక్కులో మూడు టర్బినేట్లు ఉంటాయి. పీల్చుకునే గాలిలో తేమను నింపేవి ఇవే. మ్యూకార్మా సిలో ముక్కు దూలంతో పాటు ఇవీ నల్లగా అవుతాయి. కంటికి దెబ్బ: సుమారు 50% మందిలో కంటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. కంటి వెనకాల నొప్పి, రెప్పలు ఉబ్బటం, కనుగుడ్డు ముందుకు పొడుచుకురావటం, చూపు మసక బారటం, ఒకటికి రెండు కనిపించటం.. కంటి చుట్టూ చర్మం ఎర్రబడటం, తర్వాత నల్లబడటం వంటి లక్షణాలతోనే చాలామందిలో సమస్య బయటపడుతోంది. ఇన్ ఫెక్షన్ ముక్కు, నోటి నుంచి మెదడు సమీపంలోని గాలి గదుల్లోకీ విస్తరిస్తుండటమే దీనికి కారణం. మన ముక్కు చుట్టూ 8 గాలి గదులుంటాయి. నుదుటి వద్ద (ఫ్రాంటల్), కళ్ల మధ్య (ఎత్మాయిడ్), బుగ్గల వెనకాల (మాగ్జిలరీ), మెదడుకు దగ్గర (స్పీనాయిడ్) రెండేసి గాలి గదులుంటాయి. ఇన్ ఫెక్షన్ ముక్కు, నోటి నుంచి మెదడు వద్ద గాలి గదుల్లోకీ విస్తరించొచ్చు. ఈ గదుల గోడలకు పక్కనే కావర్నస్ సైనస్ అనే భాగముంటుంది. ఇందులో 3, 4, 6 పు నాడులుంటాయి. కంటి కండరాల కదలికలను నియంత్రించేవి ఇవే. ఇన్ ఫెక్షన్ మూలంగా ఇవీ దెబ్బతింటున్నాయి. ఫలితంగా కంటి పైరెప్ప జారిపోవటం, కనుగుడ్డు కదలికలు ఆగిపోవటం, కనుపాప విస్తరించి అలాగే ఉండిపోవటం, చూపు పోవటం వంటివి తలెత్తుతున్నాయి. అలాగే దృశ్యనాడి ద్వారా ఇన్ ఫెక్షన్ మెదడుకు విస్తరించే అవకాశముంది. కంటి లక్షణాలు కొందరికి నెమ్మదిగా మొదలవుతుండగా.. మరికొందరికి చాలా వేగంగా ముదురుతున్నాయి. కొందరికి రెండు, మూడు రోజుల్లోనే ఒక కంటి చూపు పోతుండటం గమనార్హం. అంగిలి బొగ్గులా: మన నోరు పైభాగం (అంగిలి) ముక్కు గాలి గదులకు పునాదిగా పని చేస్తుంటుంది. గాలి గదుల ఇన్ ఫెక్షన్ మూలంగా ఇదీ నల్లగా, బొగ్గులాగా మారిపోతుంది. సుమారు 20% మందిలో ఇది కనిపిస్తోంది. బుగ్గల నొప్పి: ముక్కు చుట్టుపక్కల గాలి గదులు ఇన్ ఫెక్షన్‌కు గురవటం వల్ల బుగ్గలు మొద్దుబారటం, బుగ్గల నొప్పి తలెతొచ్చు. పళ్లు కదలటం: బుగ్గల వద్ద గాలిగదుల్లో ఫంగస్ ఇన్ ఫెక్షన్ మొదలైతే దవడ ప్రభావితమై దంతాలు కదిలిపోవచ్చు. ఇది పంటి నొప్పికి దారితీయొచ్చు. నివారించుకోవచ్చా? మ్యూకారేమైకోసిస్ ప్రధానంగా మధుమేహం గలవారిలోనే వస్తోంది. కాబట్టి దీన్ని కచ్చితంగా నియంత్రణలో ఉండేలా చూడగలిగితే చాలావరకు నివారించుకోవచ్చు. స్టిరాయిడ్లు ఇస్తున్నప్పుడు గ్లూకోజు మోతాదులు పెరుగుతుంటే ఇన్సులిన్ ఇస్తూ అదుపులోకి తేవాలి. అలాగే స్టిరాయిడ్లు కూడా ఆ పెయ్యాలి. దీంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • స్టిరాయిడ్లను అవసరమైనప్పుడు, తగు మోతాదులోనే వాడుకోవటం ద్వారా ఇన్ ఫెక్షన్‌ను నివారించుకోవచ్చు. ఆయాసం వంటి లక్షణాలు లేకపోతే తొలిదశలో వీటిని వాడుకోవటం తగదు.
  • ఆక్సిజన్ అందించేటప్పుడు హ్యుమిడిఫయర్ లో శుభ్రమైన నీటినే వాడటం.. హ్యుమిడిఫయర్‌ను, గొట్టాలను రోజూ మార్చటం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.
  • వ్యక్తిగత, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
  • బెటడితో కూడిన మౌత్ వాష్ తో రోజుకు రెండు సార్లు నోటిని పుక్కిలించాలి.
  • మాస్కు ధరించటం ద్వారా ఫంగస్ ముక్కులోకి, గొంతులోకి వెళ్లకుండా చూసుకోవచ్చు.
  • రెండు వారాల కన్నా ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీదున్నవారు.. ఆక్సిజన్, స్టిరాయిడ్లు తీసుకున్నవారు.. మధుమేహం నియంత్రణలో లేనివారు, రోగనిరోధకశక్తి తక్కువగా గలవారు ముందుజాగ్రత్తగా పోసకొనజోల్ మాత్రలు వేసుకుంటే ఇన్ ఫెక్షన్ నివారణకు ఉపయోగపడొచ్చు.
  • బ్యా క్టీరియల్ సైనసైటి తో బాధపడేవారు కొవిడ్-19 బారినపడితే మ్యూకార్‌ మైకోసి గా అనుమానించటం ముఖ్యం.
  • ఆక్సిజన్ పెట్టినవారికి తరచూ ముక్కును సెలైన్ ద్రావణంతో శుభ్రం చేయటం మంచిది.

  త్వరగా గుర్తిస్తే మేలు చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ఇన్ ఫెక్షన్ రెండు వైపు గాలి గదులకూ విస్తరిస్తుంది. ఇది మెదడుకు వ్యాపిస్తే పక్షవాతం తలెత్తాచ్చు. కొందరు అచేతన స్థితిలోకి వెళ్లిపోయి.. రోజుల్లోనే మరణించే ప్రమాదముంది. కాబట్టి ఇన్ ఫెక్షన్ ను వీలైనంత త్వరగా గుర్తించటం ముఖ్యం. దీంతో కంటి చూపు, ప్రాణాలు కాపాడుకోవచ్చు. తీవ్రమైన తల నొప్పి, బుగ్గల నొప్పి, కంటి నొప్పి వంటివి గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.        

ENQUIRY FORM

STAY CONNECTED
PREVIOUS POST
NEXT POST

YOU MAY ALSO LIKE

RECENT BLOGS

TOUCHING LIVES AND MAKING A DIFFERENCE

Have a Question?

If you cannot find answers to your queries, please fill out the enquiry form or call the number below. We will contact you shortly.

+91-40-6810 6589

Follow Us On